తమ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది అంటూ… మంత్రి ధర్మాన ప్రసాదరావు చేసిన కామెంట్స్ … హాట్ టాపిక్ గా మారాయి. నిజానికి అధికారంలో ఉన్న ఏ పార్టీ నాయకులు…. ప్రజల్లో తమకు వ్యతిరేకత ఉంది అనే విషయాన్ని అంగీకరంచరు. తమ పాలన అద్భుతంగా ఉన్నాయనే నిరూపించుకోవాలని అనుకుంటారు. అయితే.. సడెన్ గా.. ధర్మాన చేసిన కామెంట్స్ షాకింగ్ గా మారాయి. ఆయన చేసిన కామెంట్స్ పార్టీకి పాజిటివ్ గా మారతాయా..? లేక నెగిటివ్ గా మారే అవకాశం ఉందో చూడాలి.
అసలు మ్యాటరేంటంటే…శ్రీకాకుళం నగరంలో నిర్వహించిన గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సంస్కరణలకు ముందే ఫలితాలు ఆశించి ప్రజల ఆమోదం రాదన్నారు. ప్రభుత్వం చేస్తున్న కొన్ని కార్యక్రమాల పట్ల వ్యతిరేకత ఉందని తెలిపారు. సంస్కరణలను ప్రజలు అర్థం చేసుకోకపోవడమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. కొందరు మూడు రాజధానులను హేళన చేస్తున్నారని ప్రధాన రాజధాని విశాఖ నుంచే పాలన కొనసాగుతుందన్నారు.
సంవత్సరంలో మూడు సార్లు చట్టసభల సమావేశాలకు ప్రజాప్రతినిధులు, అధికారులు అమరావతి వెళ్తారన్నారు. రాజధానులు ఒకచోట, హైకోర్టు మరోచోట ఉన్న రాష్ట్రాలు దేశంలో ఎనిమిది ఉన్నాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. విశాఖకు రైల్వే జోన్ వస్తుందని, రోడ్డు కనెక్టివిటీ, పోర్టు, ఎయిర్పోర్టు సౌకర్యాలు ఉన్నాయని 500 ఎకరాల్లో రాజధానిని నిర్మించేయొచ్చని అన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్, సికింద్రాబాద్ జిల్లాలు బాగా అభివృద్ధి చెందాయని, స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసమే 2000లో తెలంగాణ ఉద్యమం వచ్చిందని అన్నారు. నాటి అనుభవాల దృష్ట్యా అటువంటి నమూనా రాజధాని వస్తే దెబ్బతింటామని అభిప్రాయపడ్డారు. అమరావతిని 50 వేల ఎకరాలతో 60 ఏళ్లు అభివృద్ధి చేశాక తర్వాత పొమ్మంటే మన పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే చంద్రబాబు అమరావతిలో రాజధాని నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు.