Nara Lokesh: నేనూ చిరంజీవి అభిమానినే, ఆయన సినిమా ఫస్ట్ షో చూస్తా..
తాను మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అభిమానిని అని, ఇటీవల వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాను (vaaltheru veeraiah film) చూశానని తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara lokesh) అన్నారు. యువ గళం పాదయాత్ర లో (yuva galam padayatra) భాగంగా తిరుపతి లో (tirupati) యువతతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఓ యువకుడు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. చిరంజీవి గారికి నేను కూడా ఓ అభిమానిని అని, ఆయన ఇటీవలి సినిమా వాల్తేరు వీరయ్యను కూడా చూశానని తెలిపారు. అదే సమయంలో తన మామయ్య నందమూరి బాలకృష్ణ గురించి కూడా చెప్పారు.
తాను మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అభిమానిని అని, ఇటీవల వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాను (vaaltheru veeraiah film) చూశానని తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara lokesh) అన్నారు. యువ గళం పాదయాత్ర లో (yuva galam padayatra) భాగంగా తిరుపతి లో (tirupati) యువతతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఓ యువకుడు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. చిరంజీవి గారికి నేను కూడా ఓ అభిమానిని అని, ఆయన ఇటీవలి సినిమా వాల్తేరు వీరయ్యను కూడా చూశానని తెలిపారు. అదే సమయంలో తన మామయ్య నందమూరి బాలకృష్ణ గురించి కూడా చెప్పారు. బాల మామయ్య తనకు ముద్దుల మామయ్య అని, అతని సినిమాలు మొదటి రోజు, మొదటి షోనే చూస్తానని చెప్పారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ జూనియర్ ఎన్టీఆర్ గురించి కూడా ఆయన మాట్లాడిన విషయం తెలిసిందే. 2014లో పవన్ పార్టీని పెట్టారని, ఆయన్ను ఒకసారి కలిశానని, ఎంతో మంచి మనసు ఉన్న వారని చెప్పారు. జూనియర్ రాజకీయాల్లోకి రావాలని ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కేవలం వారిద్దరే కాదని, మంచి మనసు ఉంది, ప్రజలకు సేవ చేయాలి అనుకునే వారు ఎవరు అయినా రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. ప్రజాసమస్యలు తెలుసుకోవడానికే తాను యువగళం పేరుతో పాదయాత్ర చేపట్టానని, తాము అధికారంలోకి వచ్చాక ఉద్యోగాల కల్పనతో జగన్ కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని వెల్లడించారు.
తాను మంగళగిరిలో ఓడిపోవడం పైన వైసీపీ విమర్శలు చేస్తుందని, తాను మొదటిసారి ఫెయిల్ కావొచ్చు… అయినా తనలో ఫైర్ ఉందని, 2024లో మంగళగిరిలో గెలిచి చరిత్ర సృష్టిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ, ప్రయివేటు, స్వయం ఉపాధి ఈ మూడు కలిసికట్టుగా వెళ్తే రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుందని, చంద్రబాబు హయాంలో 40వేల పరిశ్రమలు, 6 లక్షల ఉద్యోగాలు కల్పించామన్నారు. వేలాదిమందికి డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు కల్పించామని, సులభ రుణాలతో స్వయం ఉపాధి కల్పించినట్లు చెప్పారు. 35 లక్షల మందికి ఉద్యోగాల కల్పనకు పరిశ్రమలతో ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. శాంతి భద్రతలు బాగుంటేనే పెట్టుబడులు వస్తాయని, రాజకీయ కక్షతో ప్రతిపక్షాలపై దాడులు చేస్తున్నారని, కక్ష సాధింపునకు చూపే శ్రద్ధలో కొంత అభివృద్ధి పైన చూపితే పరిశ్రమలు వస్తాయన్నారు.