»Minister Ambati Rambabu Said That Janasena Is A Sellable Party
Ambati Rambabu: జనసేన అమ్ముడుపోయే సేన: మంత్రి అంబటి రాంబాబు
జనసేన(Janasena) అమ్ముడుపోయే సేన అని, హైదరాబాద్ లో వేలం పాట పెట్టేశారని మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) కామెంట్స్ చేశారు. ఏపీలోని పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం లంకెలకూరపాడు గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జనసేన(Janasena) వేలంపాటలో చాలా మంది పాల్గొన్నారన్నారు. బీఆర్ఎస్(BRS) పాడుకుంటుందో, చంద్రబాబు పాడుకుంటాడో లేకపోతే బీజేపీ(BJP) పాడుకుంటుందో, ఎవరు వేలం పాట పాడుకుంటే వారితో ఆ పార్టీ పోతుందని విమర్శించారు.

కాపులకు పట్టిన శనే పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అని, కాపులను సర్వనాశనం చేయడానికి పుట్టాడని వ్యాఖ్యలు చేశారు. జనసేన(Janasena) పార్టీ అనేది చంద్రబాబుకో, బీఆర్ఎస్ కో, లేకుంటే బీజేపీకో అమ్మేయడానికి సిద్ధంగా ఉన్న రాజకీయ పార్టీ(Political Party) అని విమర్శించారు. జనసేన(Janasena) పార్టీని నమ్మితే కొంప మునుగుతుందన్నారు.
సీఎం జగన్(CM Jagan) విశాఖలో సభ పెడితే జయప్రదం అయ్యిందన్నారు. అదే చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) పెడితే ఆ సభ ఫెయిల్ అయ్యిందన్నారు. ఏపీలో వైసీపీ(YCP) మళ్లీ అధికారంలోకి వస్తుందన్నారు. మళ్లీ జగనే ముఖ్యమంత్రి అవుతాడని, పెట్టుబడిదారులకు నమ్మకం వచ్చిందని, అందుకే అంబానీ కూడా దిగి వచ్చాడని తెలిపారు. ప్రధానమంత్రితో కూర్చునే బడా వ్యాపారులంతా ఏపీకి వచ్చి సీఎం జగన్(CM Jagan)ను ఆశీర్వదించారన్నారు. త్వరలో ఏపీలో భారీ పెట్టుబడులు రాబోతున్నాయని, ఉద్యోగ అవకాశాలు కూడా కలగబోతున్నాయన్నారు.