గత కొంతకాలంగా బీజేపీ నేత కన్నా లక్ష్మీ నారాయణ పార్టీ మారుతున్నారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కాగా… ఈ వార్తలపై తాజాగా ఆయన స్పందించారు. తాను పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు. అయితే… తమ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల.. ఆ పార్టీ తో భాగస్వామమ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని ఆయన అన్నారు.
అందుకే జనసేన నాయకులు తనకు టచ్ లో ఉంటారని పేర్కొన్న ఆయన తాను పార్టీ మారే ఉద్దేశం లేదనే సూచనలు ఇచ్చేశారు. ఇక గతంలో మాట్లాడిన మాటల్ని మరోసారి మాట్లాడిన కన్నా లక్ష్మీనారాయణ ప్రస్తుత బిజెపి ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఒంటెద్దు పోకడల వల్ల బిజెపి నేతలు ఇబ్బందులు పాలవుతున్న మాట వాస్తవమని అన్నారు. అలాగే తాను రాష్ట్ర పార్టీ వ్యవహారాలపై గుర్రుగా ఉన్న మాట వాస్తవమే కానీ పార్టీని వీడతాను అన్నమాట సరైనది కాదని ఆయన పేర్కొన్నారు.
బిజెపిలోనే కొనసాగుతానని ఆయన మరోమారు స్పష్టం చేశారు. ఇక ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో బీఆర్ ఎస్ బలం పుంజుకునే అవకాశమే లేదని ఆయన అన్నారు. తాజాగా బీజేపీ జిల్లా అధ్యక్షుల మార్పును కన్నా తప్పుబట్టారు. కోర్ కమిటీలో చర్చ జరగకుండానే జిల్లా అధ్యక్షులను మార్చారని, అధ్యక్షుల మార్పుపై తనతో చర్చించలేదని సోము వీర్రాజు తీరును కన్నా లక్ష్మీనారాయణ మళ్లీ తప్పుబట్టారు. తన వియ్యంకుడు బీఆర్ఎస్ లో ఎందుకు చేరారో సోమువీర్రాజు చెప్పాలని కన్నా ప్రశ్నలు సంధించడమే కాక ఇక్కడ పవన్‌ను, అక్కడ బండి సంజయ్‌ను బలహీనపరిచేందుకు కుట్ర జరుగుతోందని వ్యాఖ్యలు చేశారు.