జనసేన పార్టీకి చెందిన ఓ వ్యక్తి బాలికను వేధించాడంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా… అతను తమ పార్టీకి చెందిన వాడు కాదని.. అతను వైసీపీ నేత అంటూ.. ఆపార్టీ ప్రకటించడం గమనార్హం. ఇంతకీ మ్యాటరేంటంటే…
మైనర్ బాలిక తనని ప్రేమించాలంటూ జనసేన నేతగా చెప్పుకుంటున్న రాఘవరావు వేధింపులకు గురి చేశాడు. ప్రేమించకపోతే చంపేస్తానంటూ బెదిరింపులకు కూడా దిగినట్లు తెలుస్తోంది. తన మనవరాలి వయసున్న ఓ బాలికపై కన్నేసిన రాఘవరావు, నువ్వు నాకు కావాలి అందుకు నా భార్యకు విడాకులు ఇచ్చేస్తాను అంటూ ఒత్తిడి చేసినట్టు చెబుతూఛ్న్నారు. అతని చేష్టలతో ఆందోళన గురవుతున్న బాలికను ఇంకా టెన్షన్ పెట్టే విధంగా ఫ్లాట్ కి వెళ్లి చాకుతో రాఘవ రావు మరింత భయపెట్టడంతో త్రీ టౌన్ పోలీసులను బాలిక ఆశ్రయించింది. ఈ క్రమంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలు పెట్టారు. ఇక మరోపక్క బాలికను వేధించిన నిందితుడికి జనసేనలో ఎలాంటి బాధ్యతలు లేవని జనసేన ప్రకటించింది.
విశాఖపట్నం నగరంలో బాలికను వేధించిన కేసులో నిందితుడిగా ఉన్న రాఘవరావు అనే వ్యక్తికి జనసేన పార్టీలో ఎలాంటి బాధ్యతలుగానీ, క్రియాశీలక సభ్యత్వంగానీ లేవని ఇటువంటి నేరపూరిత చర్యల్లో ఉన్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను కోరుతున్నామని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు కోన తాతారావు పేరుతో ఒక ప్రకటన విడుదలైంది.
రాఘవరావు అనే వ్యక్తి జనసేన పార్టీ నాయకుడు అంటూ పార్టీ ముఖ్య నాయకులతో ఉన్న ఫోటోలు చూపిస్తూ సాగుతున్న ప్రచారాన్ని ఖండిస్తున్నామని, పార్టీ ముఖ్యులతో ఎందరో ఫోటోలు తీయించుకుంటారు. అంత మాత్రాన వారు పార్టీ బాధ్యతల్లో ఉన్న వారిగా, నాయకులుగా పరిగణించవద్దు అని విజ్ఞప్తి చేస్తున్నామని ఖండన ప్రకటనలో జనసేన పేర్కొంది. అతను వైసీపీకి చెందని వాడని.. తమ పార్టీ కాదని పేర్కొనడం గమనార్హం.