TPT: తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలకు అనుమతిచ్చే విషయమై టీటీడీ ఈవో శ్యామలరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంకా దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ సమయంలో దాతలకు ప్రత్యేకంగా గదుల కేటాయింపు ఉండదన్నారు.