VZM: వేపాడ మండల కేంద్రం స్థానిక జెడ్పీ హైస్కూల్లో అంగన్వాడీ టీచర్లకు గత ఆరు రోజుల నుండి జరుగుతున్న జ్ఞాన జ్యోతి శిక్షణా తరగతులు మంగళవారంతో ముగిసాయి. ఈ ముగింపు కార్యక్రమంలో ఏసీడీపీవో లక్ష్మీ భాయ్, ఎంఈవోలు ఎన్ నాగభూషణరావు, పి.బాల భాస్కరరావు పాల్గొన్నారు. శిక్షణ తరగతుల్లో నేర్చుకున్న బోధన అభ్యసన ప్రక్రియలో మెలకువలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.