SKLM: మెలియాపుట్టి జెడ్పీ ఉన్నత పాఠశాలలో మంగళవారం ఇద్దరు విద్యార్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఘటనలో ఒక విద్యార్థిపై మరో విద్యార్థి కర్రతో కొట్టడంతో తలకు బలమైన గాయమైంది. విద్యార్థులు మద్య చోటుచేసుకున్న వాగ్వాదం కొట్లాటకు దారితీసింది. గాయపడిన విద్యార్థిని చికిత్స నిమిత్తం టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు.