SKLM: కడప జిల్లా TDP MLC సి. రామచంద్రయ్య కుమారుడు విష్ణు స్వరూప్ శనివారం గుండెపోటుతో హైదారాబాద్లో మృతి చెందారు. ఈ హఠాన్మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని టెక్కలి MLA, మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.