NLR: ఆంధ్రప్రదేశ్ రిజర్వేషన్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (REF)లో వాకాడు మండలం కల్లూరు పంచాయతీలోని ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయురాలు శ్రీ సాయి ప్రసూన రాష్ట్ర మహిళా కార్యదర్శిగా నియమితులయ్యారు. రాష్ట్ర ఆర్ఎఫ్ అధ్యక్షుడు డాక్టర్ రామచంద్ర యూనియన్ సభ్యులతో కలసి తీర్మానించి ఉత్తర్వులను బుధవారం జారీ చేశారు.