W.G: విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ చేయాలనే దురుద్దేశపూరితమైన అంశాన్ని ఖండిస్తూ.. డిసెంబర్ 1 ఆదివారం ఉ.10గంటలకు విశాఖపట్నం కూర్మన్న పాలెం చౌరస్తా వద్ద బహుజన్ సమాజ్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో ధర్నాకు పిలుపునిచ్చారు. ఈ ధర్నాకు పెరవలి మండల రైతు, కార్మిక సంఘ నాయకులు, ప్రజలు తరలి రావాలని కోరారు.