»Face Book Love Srilanka Woman Love Marriage With Chittor Young Boy
Face book love: చిత్తూరు యువకుడితో శ్రీలంక యువతి పెళ్లి
ప్రస్తుత కాలంలో ఇన్ స్టా గ్రామ్, ఫేస్ బుక్ ప్రేమలు(love) పెరిగిపోతున్నాయి. అవును రోజురోజుకు సోషల్ మీడియా ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో ఇవి కూడా ఎక్కువవుతున్నాయి. అయితే తాజాగా ఏపికి చెందిన అబ్బాయిని ఫేస్ బుక్లో ప్రేమించిన యువతి ఏకంగా శ్రీలంక నుంచి వచ్చేసింది. వీరి లవ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సోషల్ మీడియా(social media) వాడకం పెరిగిన తర్వాత ఎవరు, ఎవరితో ఎప్పుడు లవ్(love)లో పడుతున్నారో తెలియకుండా పోయింది. తాజాగా అలాంటి సంఘటనే జరిగింది. ఏపీలోని చిత్తూరు జిల్లా అరిమాకుపల్లెకు చెందిన లక్ష్మణ్ కు ఫేస్ బుక్ ద్వారా ఓ యువతి పరిచయమైంది. క్రమంగా వారి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఆ నేపథ్యంలో వారిద్దరూ ఒకరిని ఒకరు విడిచి పెట్టలేనంతంగా తయారయ్యారు. దీంతో వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ ఆమెది మాత్రం శ్రీలంక దేశం.
ఆ తర్వాత విషయం తెలుసుకున్న యువకుడు అయినా కూడా తనకు ఇబ్బంది లేదని తన వద్దకు ఆమెను రావాలని కోరాడు. దీంతో ఆమె యువకుడి(young man) కోసం 20 రోజుల క్రితం అరిమాకులపల్లికి వచ్చింది. అంతేకాదు అది తెలుసుకున్న వారి కుటుంబ సభ్యులు 15 రోజుల క్రితం వారి పెళ్లి కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఈ విషయం తెలిసి పోలీసులు వారి ఇంటికి వచ్చి ఆమె వీసాను పరిశీలించారు. ఆ క్రమంలో ఆమె పత్రాలు సరిగ్గానే ఉన్నాయని పేర్కొన్నారు. కానీ వీసా గడువు వచ్చెే నెల 6 వరకు మాత్రమే ఉండటంతో ఆలోగా దేశం వదలి వెళ్లాలని నోటీసులు అందించారు. ఆ క్రమంలో రిజిస్టర్ వివాహం చేసుకోవాలని సూచించారు.