పల్నాడు: ఏపీఎస్ ఆర్టీసీ హెవీ మోటర్ వెహికల్ డ్రైవింగ్ ట్రైనింగ్ స్కూల్లో శిక్షణ పూర్తిచేసుకున్న డ్రైవర్లకు డిపో మేనేజర్ జీవీఎస్వీవీ కుమార్ శుక్రవారం సర్టిఫికెట్లను అందజేశారు. 18వ బ్యాచ్ శిక్షణ పూర్తిచేసుకున్న వారికి సర్టిఫికెట్ల ప్రదానం చేసినట్లు చెప్పారు. 19వ బ్యాచ్ అడ్మిషన్లు జరుగుతున్నట్లు తెలిపారు.