KRNL: అమెరికాలోకి అక్రమ వలసల నివారణలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ వలసలు వచ్చిన ప్రజలను వారి దేశాలకు పంపే విధానంలో భారతీయుల చేతికి, కాళ్లకు సంకెళ్లు వేసి యుద్ధ విమానంలో పంపడం అమానుషమని పీడీయస్‌యూ రాష్ట్ర కార్యదర్శి రాజేష్ అన్నారు. ఎమ్మిగనూరులో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ అమెరికా భారత్‌ను మిత్రదేశంగా చెప్పుకుంటూ ఇలా చేయడం సరికాదన్నారు.