PPM: సాలూరు ఎమ్మెల్యే, గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి శుక్రవారం మంగళగిరి టీడీపీ సెంట్రల్ ఆఫీసులో ప్రజల నుండి ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రజలు తమ సమస్యలను మంత్రికి తెలియజేశారు. ఆమె ప్రతి ఫిర్యాదును ఓపిగ్గా వినిపించి, తగిన పరిష్కార చర్యలు తీసుకోవడానికి అధికారులకు సూచనలు ఇచ్చారు.