పల్నాడు: చిలకలూరిపేట పట్టణంలోని పురుషోత్తమ పట్నం నందు ఉన్న అన్న క్యాంటీన్‌ను బుధవారం నాడు మున్సిపల్ కమీషనర్ పి .శ్రీ హరి బాబు సందర్శించి అక్కడే టిఫిన్ చేసి నాణ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమీషనర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం అతి తక్కువ రుసుము తో నాణ్యమైన పలహారాలను అందుబాటులో ఉంచిందని అన్నారు.