ప్రకాశం: త్రిపురాంతకంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్, టీచర్స్ సమావేశానికి ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు చదువులోనే కాకుండా ఇతర క్రీడల్లోనూ రాణించేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని ఎమ్మెల్యే సూచించారు. అనంతరం వివిధ సంస్కృతి కార్యక్రమాలను ఆయన ఆసక్తిగా తిలకించారు.