ATP: జిల్లాలో SP జగదీష్ ఆదేశాల మేరకు రోడ్డు భద్రతా మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పోలీసులు, ఆర్టీఏ అధికారులు కలిసి వాహనదారులకు హెల్మెట్, సీట్ బెల్ట్ ప్రాధాన్యతను వివరిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి జరిమానాలు విధిస్తున్నారు. ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ట్రాఫిక్ నియమాలు పాటించాలని ఎస్పీ కోరారు.