కోనసీమ: ఫ్లెక్సీ లపై వివాదాస్పద రాతలు రాస్తే చర్యలు తప్పవని అమలాపురం డీఎస్పీ టిఎస్ఆర్కె.ప్రసాద్ హెచ్చరించారు. అమలాపురం రూరల్ సీఐ కార్యాలయంలో ఇవాళ ఫ్లెక్సీ యజమానులతో సమావేశం అయ్యి పలు సూచనలు చేశారు. సూచనలు కచ్చితంగా పాటించాలని లేనిచో చర్యలు తప్పవని అన్నారు. ఈ సమావేశంలో రూరల్ సీఐ ప్రశాంత్ కుమార్ పాల్గొన్నారు.