SKLM: కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ని ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో శుక్రవారం శ్రీకాకుళం ఎంపీ, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లాలో రైల్వేల అభివృద్ధి పనుల గురించి చర్చించినట్లు సోషల్ మీడియా వేదిక ద్వారా తెలిపారు. కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.