ELR: జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా 18వ విడత సామాజిక తనిఖీని ఈనెల 16వ తేదీ మంగళవారం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో బేబి శ్రీలక్ష్మి తెలిపారు. గణపవరం ఎంపీడీవో కార్యాలయంలో జరిగే ఈ కార్యక్రమంలో 2024-25 సంవత్సరంలో మండలంలోని 25 గ్రామాల్లో చేపట్టిన పనులు, సమస్యలపై చర్చిస్తారు. ఈ తనిఖీకి మండలంలోని అధికారులు, ప్రజా ప్రతినిధులు హాజరు కావాలని ఎంపీడీవో కోరారు.