కృష్ణా: ఉగ్రవాదంపై భారత్ పోరు అద్వితీయం అని టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు అన్నారు. గురువారం సాయంత్రం అవనిగడ్డలో టీడీపీ మండల అధ్యక్షులు యాసం చిట్టిబాబు ఆధ్వర్యంలో విజయ సింధూరం – జయహో మోదీ కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ, జనసేన నాయకులు పురవీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించి, జయహో భారత్ అంటూ నినదించారు.