కృష్ణ: గన్నవరం నియోజకవర్గంలోని పంచాయతీ రాజ్ రోడ్లు దెబ్బతిన్న ప్రాంతాల్లో వెంటనే మరమ్మతులు ప్రారంభించాలని MLA యార్లగడ్డ వెంకట్రావు సూచించారు. మంగళవారం గన్నవరం TDP ఆఫీస్లో చీఫ్ ఇంజినీర్ విజయకుమారితో జరిగిన సమావేశంలో గ్రామాల్లో మురుగు నీరు నిల్వ కాకుండా అవసరమైతే కొత్త కాలువలు ఏర్పాటు చేయాలని తెలిపారు. పనుల కోసం నిధులు అవసరమైతే వెంటనే తెలియజేయాలన్నారు.