పల్నాడు: ఈపూరు మండలంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా తమ నివాస స్థలాలు, కార్యాలయాలను ప్రతి ఒక్కరూ శుభ్రం చేసుకోవాలని ఏంపీడీఓ తెలిపారు. ముందుగా విద్యార్థులతో కలిసి మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.