GNTR: భారత క్రికెట్ యువ క్రీడాకారుడు అబ్దుల్ రషీద్ శుక్రవారం గుంటూరులో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక సుప్రసిద్ధ హజరత్ సయ్యద్ బాజీ షహిద్ అవులియా వారి దర్గాకు విచ్చేసి ఆయన ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు రషీద్ తో ఫోటోలు దిగేందుకు ఆసక్తి కనబరిచారు. రషీద్ ప్రతి ఒక్కరితో ఫోటోలు దిగుతూ సంతోషం వ్యక్తం చేశారు.