W.G: సీఎం సహాయనిధి పేదవారికి ఆపదలో అండగా నిలుస్తోందని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. మంగళవారం చాగల్లు మండలం కలవపల్లికి చెందిన గుడిసె చిన్న పొసమ్మకు రూ.25,000, చంద్రవరంకి చెందిన ఎం.వీర వెంకట సత్యనారాయణకు రూ.27,493, ఊనగట్లకు చెందిన పి.సత్యనారాయణకు రూ.51,019, ఎస్.ముప్పవరంకు చెందిన జి.సుధాకర్‌కు రూ.36,084 చెక్కులు అందజేశారు.