VSP: లయన్స్ క్యాన్సర్ అండ్ జనరల్ హాస్పిటల్లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ మాజీ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎన్.వి.ఎన్. దుర్గా ప్రసాదరావు, అమెరికాలో నివసిస్తున్న తన కుమార్తె ఎన్. పద్మజ తరపున ఆసుపత్రి అభివృద్ధి కోసం రూ.1,50,000 విరాళం అందించారు. ఆర్థోపెడిక్ విభాగం బలోపేతానికి వినియోగించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.