అన్నమయ్య: చిన్నమండెం మండలం బోరెడ్డిగారిపల్లిలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్వగృహంలో శ్రీ సాయిబాబా స్వామికి అభిషేకం, అర్చనతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. లోక కల్యాణార్థం జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రిదంపతులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కర్నూలు నుంచి వచ్చిన భజన బృందం భజనలు నిర్వహించగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.