»Extension Of Chandrababus Remand Hearing On Bail And Custody Petitions Tomorrow
Chandrababu: చంద్రబాబు రిమాండ్ పొడిగింపు.. బెయిల్, కస్టడీ పిటిషన్లపై రేపు విచారణ
చంద్రబాబు రిమాండ్‌ను ఏసీబీ కోర్టు అక్టోబర్ 19వ తేది వరకూ పొడిగిస్తున్నట్లు ఆదేశాలిచ్చింది. దీంతో మరో 14 రోజులు ఆయన రిమాండ్‌లో ఉండనున్నారు. అలాగే ఆయన దాఖలు చేసిన బెయిల్, పిటిషన్‌పై రేపు విచారణ జరగనుంది.
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్‌ను ఏసీబీ కోర్టు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ 19వ తేది వరకూ పొడిగిస్తూ ఆదేశాలిచ్చింది. దీంతో మరో 14 రోజుల వరకూ చంద్రబాబు రిమాండ్‌లో ఉండాల్సి ఉంటుంది. గురువారం ఏసీబీ కోర్టు ముందుకు వర్చువల్‌గా చంద్రబాబు హాజరవ్వగా ఇరువురి లాయర్లు తమ వాదనలు వినిపించారు.
మరో వైపు చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్, సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌పై విచారణ రేపటికి కోర్టు వాయిదా వేసింది. శుక్రవారం మధ్యాహ్నం ఇరుపక్షాల వాదనలు వింటామని ఏసీబీ కోర్టు వెల్లడించింది. ఆ రెండు పిటిషన్లపై రెండు రోజులపాటు సుదీర్ఘంగా వాదనలు జరగ్గా చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే, సీఐడీ తరపున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తమ వాదనలను కోర్టుకు వినిపించారు. ఈ విచారణను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు కోర్టు తెలిపింది.