కృష్ణా: కానూరు సనత్నగర్లో ఇద్దరు మైనర్లకు కొంతమంది గంజాయి తాగించడానికి బలవంతం చేశారు. దీనిని వద్దని తిరస్కరించడంతో వారిపై దాడి చేశారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అడ్డుకోగా వారిపై కర్రలు, రాడ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. శనివారం బాధితుల ఫిర్యాదు మేరకు నయీమ్, సమీర్, నజీర్ సహా 22 మందిపై పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేశారు.