ATP: గుంతకల్లు పట్టణం జగ్జీవన్ రామ్ కాలనీలో సీపీఐ ఎం ఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు సోమవారం పర్యటించారు. కాలనీలో సీసీ రోడ్డు, డ్రైనేజీ కాలువలు లేక ఇబ్బందులు పడుతున్నామని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి సురేష్ మాట్లాడుతూ.. కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని వారు డిమాండ్ చేశారు.