కోనసీమ: డాక్టర్ చిక్కం సత్య సంజీవ్ టైమ్స్ ఐకాన్స్ ఆఫ్ ది హెల్త్ కేర్ అవార్డు అందుకున్నారు. మామిడికుదురు మండలం ఈదరాడకు చెందిన ప్రముఖ హోమియోపతి వైద్యులు డాక్టర్ చిక్కం సత్య సంజీవ్ హోమియోపతిలో చేస్తున్న అత్యున్నత సేవలకు విజయవాడలో ‘టైమ్స్ ఐకాన్స్ ఆఫ్ ది హెల్త్ కేర్ 2024 అవార్డును’ మాజీ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వెంకటరమణ చేతుల మీదుగా అందుకున్నారు.