VZM: జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అధ్యక్షతన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఇవాళ జరిగింది. ఈ సందర్భంగా ప్రస్తుతం జిల్లాలో జరుగుతున్న ధాన్యం కొనుగోలు ప్రక్రియపై అధికారులతో సమీక్షించారు. ధాన్యం సేకరణ సజావుగా సాగేలా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రైతు సంక్షేమమే ధ్యేయమని, రైతులకు ఇబ్బందులు కలగకూడదన్నారు.