ASR: డుంబ్రిగూడ మండల కేంద్రంలోని ప్రపంచ టీబీ దినోత్సవం సందర్భంగా స్థానిక వైద్యాధికారి అంబికా రమణి ఆధ్వర్యంలో శనివారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా టీబీ వ్యాధిపై గిరిజనులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దగ్గు, జ్వరం, ఆకలి మందగించడం, బరువు తగ్గడం, రక్తం కఫంలో ఉండటం వంటి లక్షణాలు 2 వారాలకు మించి ఉంటే కచ్చితంగా టీబీ పరీక్ష చేయించుకోవాలని సూచించారు.