VSP: జిల్లాకు చెందిన సీనియర్ జర్నలిస్టు వడ్డాది ఉదయకుమార్ను ఫోరం ఫర్ ఆర్టీఐ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా నియమించారు. ఈ మేరకు జాతీయ అధ్యక్షులు మట్టా ప్రసాద్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇప్పటివరకు విశాఖ జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించిన ఉదయకుమార్, సమాచార హక్కు చట్టం, హ్యూమన్ రైట్స్, లోకాయుక్త అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో గుర్తింపు పొందారు.