కృష్ణా: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా గుడివాడ మార్కెట్ సెంటర్లోనే విగ్రహానికి పట్టణ ప్రముఖులు మంగళవారం పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశ ఆర్థిక సంస్కరణలకు పునాది వేసిన నేతగా పీవీ నరసింహారావు చిరస్థాయిలో నిలిచిపోతారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉదయ్ భాస్కర్ రావు, ప్రసాద్, రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.