అన్నమయ్య: సోషల్ మీడియాలో జిల్లాకు సంబంధించి కొన్ని తప్పుడు వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయని జిల్లా పోలీసులు తెలిపారు. అవి వాస్తవానికి తమిళనాడు రాష్ట్రాల్లో జరిగిన పాత సంఘటనలని వారు స్పష్టం చేశారు. ప్రజలు ఫేక్ న్యూస్‌ను నమ్మకుండా అధికారిక సమాచారం మాత్రమే విశ్వసించాలని కోరారు. తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.