ప్రకాశం: కనిగిరి డివిజన్లో మంథా తుఫాన్ దృష్ట్య సిబ్బందిని అప్రమత్తం చేశామని ఈఈ ఉమాకాంత్ తెలిపారు. కనిగిరి విద్యుత్ శాఖ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగులు, కార్మికులు అందుబాటులో ఉంటూ విద్యుత్ సరఫరాలో జాప్యం లేకుండా చూడాలని స్పష్టం చేశారు. ఏ సమస్య వచ్చినా పై అధికారులకు వెంటనే తెలియపరచాలని ఆదేశించారు.