AKP: గొలుగొండ శాఖ గ్రంథాలయంలో ఆదివారం ‘చదవడం మాకిష్టం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులచే గ్రంథా లయాధికారి రాజబాబు బుక్ రీడింగ్, స్టోరీ టెల్లింగ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. గ్రంథాలయాధికారి మాట్లాడుతూ.. విద్యార్థులు గ్రంథాలయాలకు రావడం వల్ల విజ్ఞానం పెరుగుతుందని తెలిపారు.