ASR: కొయ్యూరు మండలం మంపలో ఏర్పాటు చేసిన బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్ నుంచి సిగ్నల్స్ రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వినియోగదారులు ఆవేదన చెందారు. తరచూ సిగ్నల్స్ రాక ఇబ్బందులు పడుతున్నామన్నారు. నెలలో వారం రోజులు కూడా సిగ్నల్ ఉండడం లేదన్నారు. తమను ఆర్ధిక దోపిడీ చేస్తున్న బీఎస్ఎన్ఎల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని సోమవారం మంప ఎస్సై కే.శంకరరావుకు ఫిర్యాదు చేశారు.