NDL: పాణ్యం నియోజకవర్గంలోని కల్లూరు అర్బన్ 37వ వార్డ్ కార్పొరేటర్ షేక్ అయేషా సిద్ధిఖా వైసీపీ నుండి టీడీపీలో చేరారు. ఆమె పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు గౌరు వెంకట రెడ్డి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ బలోపేతానికి పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.