ఈ నెల 27న జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి కృష్ణా జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. కలెక్టరేట్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 77 పోలింగ్ కేంద్రాలను గుర్తించగా.. ఇందులో 42 కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించామన్నారు.