ELR: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల గోడౌన్‌ను జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి తనిఖీ చేశారు. మంగళవారం ఏలూరు కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్న ఈవీఎం యంత్రాలు, వివిప్యాట్లు భద్రపరిచిన గోడౌన్‌ను తనిఖీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈవీఎం గోడౌన్ తనిఖీలో భాగంగా ఈవీఎం గోడౌన్‌కు వేసిన భద్రతా సీళ్లు, సీసీ కెమెరాలు పనితీరు, అగ్నిమాపక దళ పరికరాలు పరిశీలించారు.