ELR: జీలుగుమిల్లీలో మంగళవారం జాతీయ వాణిజ్య పంటల పరిశోధన కేంద్ర బృందం పొగాకు పంటలను పరిశీలించారు. గత 30 సంవత్సరాలుగా పొగాకు రైతులు పొగాకు మొక్కలలో అధికంగా వచ్చే పిలకల వల్ల దిగుబడి నాణ్యత తగ్గుతూ వస్తుంది అని రైతులు బృందానికి వివరించారు. దీనికి తగిన సలహాలు రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పొగాకు బోర్డు అధికారులు, రైతులు పాల్గొన్నారు.