కృష్ణా: సీఎం చంద్రబాబుకి ఎకనామిక్ టైమ్స్ ప్రతిష్టాత్మకమైన బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్- 2025 అవార్డు ప్రకటించడం రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణమని ఎమ్మెల్యే వెంకట్రావు గురువారం పేర్కొన్నారు. గత ఐదేళ్ల వైసీపీ అస్తవ్యస్త పాలనలో అన్ని రంగాలలో వెనుకబడిపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలను సమపాళ్లలో అమలు చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారన్నారు.