KRNL: భారత జాతీయ యువజన కాంగ్రెస్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనట్లు జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మహేంద్ర మంగళవారం తెలిపారు. జనవరి 2న జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో రాయలసీమ జోనల్ రిటర్నింగ్ ఆఫీసర్ సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా అవగాహన సమావేశం నిర్వహిస్తారు. సభ్యత్వం, నామినేషన్లు, ఎన్నికల విధానంపై వివరాలు తెలియజేస్తారు. 18–35 ఏళ్ల యువకులు హాజరుకావాలని ఆయన కోరారు.