NLR: ఉదయగిరి మండలం మాసాయిపేట గ్రామానికి చెందిన TDP నాయకుడు మన్నెం వెంగన్న హఠాన్మరణం పట్ల ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తీవ్ర దిగ్భ్రాంతి, ప్రగాఢ విచారం వ్యక్తం చేశారు. శనివారం ఎమ్మెల్యే, వెంగన్న పార్థివ దేహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.