ASR: కొయ్యూరు మండలంలో ఆదివారం రాత్రి గాలివాన భీభత్సం సృష్టించింది. ఈదురు గాలులతో కురిసిన భారీ వర్షం పలకజీడి గ్రామంలో ఉన్న బాలికల ఆశ్రమ పాఠశాల వసతి గృహాన్ని చిన్నాభిన్నం చేసింది. వసతి గృహంలో ఇనుప రాడ్స్ అన్నీ విరిగిపోయి, పైకప్పు మొత్తం ఎగిరి పోయి, చెల్లాచెదురు అయ్యాయని వార్డెన్ రాజేశ్వరి సోమవారం తెలిపారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.