TPT: అంబేద్కర్ అవతార పురుషుడని సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కొనియాడారు. సత్యవేడులో సోమవారం జరిగిన అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్ వల్లే రాష్ట్రంలో 31 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలోకి అడుగు పెట్టారని కొనియాడారు. ఆయన ఆశయాల సాధనకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు