E.G: దేవరపల్లిలోని కరుటూరి ఫంక్షన్ హాల్ వద్ద లక్ష హనుమాన్ చాలీసా పారాయణ మహోత్సవం శనివారం వైభవంగా నిర్వహించారు. ఋషిరత్న శ్రీ రామదాసమ్మ ఆధ్వర్యంలో సుమారు 2000 మంది భక్త బృందంతో అన్యోన్య సహాయముగా లోక కళ్యాణార్థం ఈ కార్యక్రమం జరిగింది. ముందుగా ఆంజనేయ స్వామి వారిని జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్య ధ్యాన మందిరం నుంచి ఊరేగింపుగా తీసుకువెళ్లారు.